36 ఏళ్ళ వయసొచ్చినా ఆమె పరిస్థితి దయనీయం
- September 16, 2017
మనామా: భారతదేశంలో 36 ఏళ్ళుగా విదేశీయురాలిగా జీవిస్తున్న ఓ మహిళ ఎట్టకేలకు బహ్రెయిన్ చేరుకుని, తన జాతీయతపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 1980లో బహ్రెయినీ తండ్రికీ, భారతీయురాలైన మహిళకి సదరు మహిళ జన్మించింది. అయితే ఆ తర్వాత ఆ బహ్రెయినీ తండ్రి, ఆ భారతీయురాలితో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన బిడ్డను తీసుకుని ఆ మహిళ, కొన్ని అనివార్య కారణాలతో బహ్రెయిన్‌ని విడిచపెట్టాల్సి వచ్చింది. పదేళ్ళలోపు ఆ చిన్నారి తిరిగి బహ్రెయిన్‌కి చేరుకోవాల్సి ఉన్నా, అందుకు తగిన పత్రాల్ని అందించడంలో ఆ చిన్నారి తండ్రి విఫలమయ్యారు. దాంతో ఆ చిన్నారి ఇటు భారతీయురాలు కాలేక, అటు బహ్రెయినీ పౌరసత్వం పొందలేక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఆమె బహ్రెయిన్‌లోకి ప్రవేశించి, అక్కడే తన పౌరసత్వం కోసం పోరాటం చేస్తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







