మెగాస్టార్ చిరంజీవే నాకు స్ఫూర్తి

- September 16, 2017 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవే నాకు స్ఫూర్తి

సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం శ్రీవల్లి. ఈ సినిమాలో నటించిన హీరోగా మారాడు రజత్. సినీ పరిశ్రమలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే నా లక్ష్యమని తెలపాడు రజత్. ఈ సినిమాలో నటించిన రజిత్ శ్రీవల్లి ఎలాంటి అనుభుతినిచ్చిందో తెలిపాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ...సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. విజయేంద్రప్రసాద్‌గారి సూచనలకు అనుగుణంగా నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాను. గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కావడంతో ఎక్కువ భాగాన్ని బ్లూమ్యాట్‌లో తెరకెక్కించారు. మన పక్కన లేనవి ఉన్నట్టుగా వాతావరణాన్ని ఊహించుకొని నటించడం ఛాలెంజ్‌గా అనిపించింది. సినిమాలోని చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లెమాక్స్ ఘట్టాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి. ఈ రంగంలోకి రావడానికి  మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి...
ఎందరో వర్థమాన నటుల మాదిరిగానే నేను కూడా చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చాను. నా వృత్తిలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లోనైనా రాణిస్తాననే నమ్మకముంది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యువతరాన్ని మెప్పించే వినూత్న పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తాననే నమ్మకముంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com