ఫిష్ మంచూరియా
- September 16, 2017
కావలసిన పదార్థాలు: (వంజరం లేదా, ముళ్లు తీసిన) చేప ముక్కలు - అరకేజీ, ఉల్లిపాయ - 1, స్ర్పింగ్ ఆనియన్స్ - 1 కట్ట, పచ్చిమిర్చి -4, క్యాప్సికం - 1, అల్లం -అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు - 4, సోయాసాస్ - 2 టీస్పూన్లు, కారం-1 టీ స్పూను, వెనిగర్ -1టీ స్పూను, అజినమోటో - చిటికెడు, మిరియాలపొడి, చక్కెర - పావు టీస్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, నూనె - తగినంత, (రెడ్) ఫుడ్ కలర్ - చిటికెడు.
గ్రేవీ కోసం: కార్న్ ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, వంటసోడా - రెండు చిటికెలు, కారం - ఒకటిన్నర స్పూను, అజినమోటో - పావు టీస్పూను, ఉప్పు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: గ్రేవీ పదార్థాలన్నీ తగినంత నీటిలో చిక్కగా కలిపి, చేప ముక్కలు ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. 3 టేబుల్ స్పూన్ల నూనెలో తరిగిన క్యాప్సికం, ఉల్లి, స్పింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మెదిపిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పెద్దమంటపై వేగించాలి. ఇప్పుడు మంట తగ్గించి సోయాసాస్, కారం, వెనిగర్, అజినమోటో, మిరియాలపొడి, పంచదార వేసి వేగించాలి. తర్వాత చేప ముక్కలు కలిపి మంట పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టిన తర్వాత దించేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







