ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్‌బాబు
- September 16, 2017
ఎన్ని తరాలు మారినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయే నటులు ఎస్వీ రంగారావు. ఆయన నటన, పోషించిన పాత్రలు నిత్యనూతనం. ఆయన సమకాలీన నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్రలో మోహన్‌బాబు నటించబోతున్నారు. ఎస్వీ రంగారావు పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ... అందులో మోహన్‌బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేలా ఉంటుందని, అక్టోబరు చివర్లో కానీ, లేదంటే నవంబరు మొదటివారంలో కానీ ఆయన సెట్లోకి అడుగుపెట్టనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, ప్రకాష్‌రాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోందీ చిత్రం. ప్రస్తుతం పాలకొల్లులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







