జాతి వివక్షకు సంబంధించిన సెర్చింగ్ కీ వర్డ్స్ను తొలగించిన గూగుల్
- September 17, 2017
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం కొన్ని పదాలు (కీ వర్డ్స్)ను తొలగించనున్నట్లు ప్రకటించింది. జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్లో జాత్యహంకార అంశాలను కొన్ని ప్రత్యేక యాడ్ కీ వర్డ్స్ తో నెటిజన్లు వెతుకుతున్నారు. దీనిపై జాతి వివక్ష దాడులకు గురైన వారితో పాటు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. తీవ్ర విమర్శలు ఎదుర్కొనడంపై సంస్థ ప్రతినిధులు స్పందించారు. జాతి వివక్షకు సంబంధించిన సెర్చింగ్ కీ వర్డ్స్ను తొలగిస్తున్నట్లు తెలిపారు.
వై డు జ్యూ రుయిన్ ఎవ్రీథింగ్, ద ఎవిల్ జ్యూ, బ్లాక్స్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్, జెవిష్ కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్ లాంటి ఎన్నో పదాలను తొలగించినట్లు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ ఉపాధ్యక్షుడు శ్రీదర్ రామస్వామి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న పదాలను తొలగించడంతో ఆ తరహా ప్రకటనలకు కూడా గూగుల్ మద్ధతు తెలపదని చెప్పారు. జాతి విద్వేష దాడులను ఏ వ్యక్తిగానీ, సంస్థగాని సహించదని.. అందులో భాగంగానే గూగుల్ స్పందించి కొన్ని కీ వర్డ్స్ను తొలగించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







