ఫేస్ బుక్ పరిచయం కారణంగా లండన్ లేడి చేతిలో మోసపోయిన ఒక తెలుగు డాక్టర్
- September 18, 2017
ఫేస్ బుక్‌లో పరిచయాలు, ఆన్లైన్లో మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తికి రెండు నెలల కిందట ఫేస్బుక్లో లండన్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. వారిమధ్య రోజూ ఛాటింగ్ జరుగుతోంది. లండన్ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ వెంటనే ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్ కరెన్సీ లేదని, తన దగ్గర 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో ఫోన్ చేయించింది. ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె ఖాతాలో జమ చేశారు. డబ్బు అందుకున్న మరుక్షణం నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ఆమె నుంచి ఎటువంటి సమాచారంలేదు. దీంతో ఆ డాక్టర్‌కి అప్పటికి గానీ మెలకువ రాలేదు. మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ పటమట ఫోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







