దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్‌పై తీయబోతున్న సినిమా పేరు లక్ష్మీస్ ఎన్టీఆర్
- September 18, 2017
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద ప్రకటన చేశాడు. వంగవీటి సినిమా తీసి బెజవాడలో అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ.. తెలుగు రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌పై సినిమా తీయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా తీయడానికి చేసిన పరిశోధన పూర్తయిందని, ఈ మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత.. లక్ష్మీపార్వతి చెప్పిన నిజానిజాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ బయోపిక్‌కు బదులుగా.. ఆయనను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిన తెర వెనుక బాగోతాలను సినిమాగా తీయనున్నట్లు వర్మ తెలిపాడు. ఈ సినిమా తీయడానికి తానెంతో కుతూహలంగా ఉన్నట్లు చెప్పాడు.
ఈ సినిమాకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు రాంగోపాల్ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నిజమని నమ్ముతున్న అబద్ధాల మాటున దాగిన నగ్న సత్యాలను, అసలుసిసలు వాస్తవాలను తెరకెక్కిస్తున్నట్లు వర్మ చెప్పాడు. ఎవరైతే ఎన్టీఆర్ కడుపుపై గుద్ది, వెన్నుపోటు పొడిచారో.. వారి గురించి అసలు నిజాలను బయటపెడతానని రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎన్టీఆర్ జీవితంలో నిజంగా ఏం జరిగిందో, మరీ ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో ఏం జరిగిందనే విషయంపై ఉంటుందని వర్మ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







