అంతర్గత ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు

- September 18, 2017 , by Maagulf
అంతర్గత ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు

బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ పూసి జుట్టు దువ్వి అందంగా తయారయ్యేందుకు ఎన్నో కాస్మోటిక్స్ వాడటం ఇటీవలి కాలంలో అధికమైంది. కానీ శరీరంలోచేరిన మలిన పదార్థాలను బయటకు పంపడం, ప్రమాదకర పదార్థాలను విచ్ఛిన్నం చేసి ప్రమాద రహితమైనవిగా మార్చేందుకు అనుసరించాల్సినవి మాత్రం చేయడంలేదు. 
 
కాలేయం, మూత్రపిండాలు అంతర్గత మలినాలను వదిలించుకునే బాధ్యతను నిర్వహిస్తాయి. ఇవేకాక శోషరస వ్యవస్థ ముఖ్యపాత్ర వహిస్తుంది. అటువంటి వ్యవస్థలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వాటి మెరుగైన పనితీరు బాగుండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. కేవలం దాహం వేసినపుడే నీరు తాగుతాను అనుకుంటే ఇబ్బంది వస్తుంది. 
 
రక్తంలో పలురకాల మలినాలు చేరుతుంటాయి. వాటిని వదిలించకపోతే పలు అనారోగ్యాలు వస్తాయి. అందుకు తగినంతనీరు తాగి రక్త శుద్ధి జరిగేట్లు చూసుకోవాలి. ఎంత స్వచ్చ మైన నీరు, ఎంత ఎక్కువ మోతాదులో అందిస్తే శరీరానికి అంత మంచిది. గాలి కూడా ఒరరకమైన ఇంధనం. గాలి బాగా పీల్చి వదలగలిన యెగా, ఎయిరోబిక్స్ వంటివి తప్పకుండాచేయాలి. 
 
జీర్ణ వ్యవస్థలో తయారయ్యే వ్యర్థాలు మల రూపంలో బయటకు పంపబడాలి. మలం ఎక్కువ సేపు నిలువ ఉండకూడదు. కాబట్టి రోజూ మల విసర్జన చేయాలి. ఇది క్రమబద్ధంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. మలబద్దకం రానివ్వని తాజా కూరగాయలు, ఆకు కూరలు ఆహారంగా తీసుకోవాలి. శరీరం విషయంలో కొద్దిపాటి శ్రద్ధ మనం చూపితే ఆ శరీరంలోని అంగాలు మనకు ఆరోగ్యం, ఆనందం అందిస్తాయి. బ్రతికినంత కాలం హుషారుగా వుండవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com