దాడికి గురైన సిరియన్ మహిళ అల్ అమాన్‌కి తరలింపు
- September 18, 2017
మనామా: సిరియాకి చెందిన ఓ మహిళ, భర్త చేతిలో అతి కిరాతకంగా దాడికి గురయిన ఘటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. అతి కిరాతకంగా భర్త ఆమెను గాయపర్చగా, ఐదు రోజుల అనంతరం ఆమెను సలమానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 35 ఏళ్ళ జోహ్రా సోభి, 52 ఏళ్ళ బహ్రెయినీ భర్త నుండి విడాకులు తీసుకుంది పదేళ్ళ వైవాహిక జీవితం అనంతరం. ఆమెకు ఐదుగురు సంతానం. తన మాజీ భర్త తనపై అతి దారుణంగా దాడికి పాల్పడి, చంపేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి పరిస్థితిని ఆమె కుమార్తెలు ఇరుగు పొరుగువారికి తెలపడంతో సమాచారం పోలీసులకు అందింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి, వాస్తవాల్ని వెలికి తీయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ టీమ్, ఎస్‌ఎంసిలో బాధితురాల్ని పరామర్శించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమెను షెల్టర్‌కి తరలించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







