ఫ్లిప్‌కార్ట్ నాలుగు రోజులు పండుగ నేటి అర్థరాత్రి నుంచే
- September 19, 2017
ఫ్లిప్‌కార్ట్ నాలుగు రోజులు పండుగ నేటి అర్థరాత్రి నుంచే ప్రారంభం కాబోతుంది. భారీ డిస్కౌంట్లతో 'బిగ్ బిలియన్ డేస్' సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోతుంది. నేటి అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఇది జరుగుతుంది. అన్ని కేటగిరీలపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. భారీ ఎత్తున్న డిస్కౌంట్లతో పాటు, ఫ్యాషన్, దుస్తులు, షూలు, గాడ్జెట్లు, హోమ్ అప్లియెన్స్‌పై ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను అందిస్తోంది. తొలిసారి ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్లను ఎంపికచేసుకునే స్పెషల్ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్ అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ సేవింగ్స్‌ను పొందనున్నారు.
ఫోన్లపై ఆఫర్లు...
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7ను కేవలం రూ.29,990కే అందించబోతుంది. దీని మార్కెట్ ధర 46వేల రూపాయలు. కొత్తగా లాంచ్ అయిన హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై ఈ నాలుగు రోజులు స్పెషల్ డీల్స్‌ను అందుబాటులో ఉంచుతుంది.
వస్త్రాలు...
మహిళలు, పురుషుల వస్త్రాలపై కంపెనీ 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు వంటి వాటిపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాక గేమింగ్ ల్యాప్‌టాప్‌లను సగం ధరకే అందించనున్నట్టు తెలిపింది. ఇవి మాత్రమే కాక, బిగ్ బిలియన్ సేల్‌లో ఉత్పత్తులు, బ్రాండులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్, బై బ్యాక్ గ్యారెంటీ, బై నౌ పే లేటర్ వంటి ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్‌లను ప్రవేశపెడుతోంది.
తాజా వార్తలు
- మతపరమైన వ్యవహారాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై యూఏఈ – ఒమన్ చర్చలు
- భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు తెర..డీజీపీ ఆనంద్ చొరవతో పరిష్కారం
- ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్..
- యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- సౌదీ అరేబియాలో పేపర్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్..భారత పెవిలియన్‌ను ప్రారంభించిన కాన్సుల్ జనరల్
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘టుగెదర్ రీలోడెడ్’ సంగీత విభావరి
- అబుదాబి హోటల్లో ఘర్షణ కేసు.. 8 మంది నిందితులకు ఊరట..!!
- సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!







