జూబ్లీహిల్స్‌లో కనులపండువగా..బతుకమ్మ సంబరాలు
- September 19, 2017
జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్(విద్యాశ్రమం)లో మంగళవారం ప్రీప్రైమరీ విభాగంలో బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించారు. సరస్వతి, దుర్గాదేవి, గాయత్రీదేవి తదితర అలంకారాలలో విద్యార్థులు అందంగా ముస్తాబై వచ్చారు.
అమీర్‌పేట: బేగంపేటలోని మహర్షి మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ఇంటర్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన పూలతో పెద్దపెద్ద బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో సందడి చేశారు. కళాశాల కార్యదర్శి లక్ష్మీకాంతమ్మ, ప్రిన్సిపల్ మల్లీశ్వరి, ఉత్సవ కమిటి నిర్వాహకులు నాగేంద్రబాల తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఆసుపత్రి: యాప్రాన్ ధరించి మెడలో స్టెతస్కోప్‌తో ఆసుపత్రిలో కలియతిరుగుతూ కన్పించే వైద్య విద్యార్థినులు గత నాలుగు రోజులుగా విద్యాభ్యాసం, విధులకు దూరంగా ఉంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వారంతా సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని చక్కగా ముస్తాబయ్యారు. బతుకమ్మలను పేర్చి ఒకచోట చేర్చి వాటిచుట్టూ ఆడిపాడి అలరించారు. గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న కాలేజీ ఫెస్ట్-2017 సందర్భంగా ఈ ఆకర్షణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. 2కే13 బ్యాచ్‌కు చెందిన గాంధీ కళాశాల వైద్యవిద్యార్థుల ఆధ్వర్యంలో 'సోలాస్టా' పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
శిల్పారామంలో నేటినుంచి
మాదాపూర్: శిల్పారామంలో బుధవారం నుంచి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4.30 నుంచి 6గంటల వరకు శిల్పారామం ప్రధాన ల్యాన్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేయనున్నారు. అనంతరం యాంపీ థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం సంగీతకళ, రాజ్యలక్ష్మిల కర్ణాటక సంగీత గాత్ర కచేరి, మయూరి కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటాయి.
26న చిత్రలేఖన పోటీలు.. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఈనెల 26న మహిళలకు వాటర్కలర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఉత్తమ చిత్రాలు గీసిన వారికి మొదటి బహుమతి కింద రూ.10వేల నగదు, రెండో బహుమతిగా రూ 7,500, మూడో బహుమతిగా రూ.5వేలతోపాటు ప్రోత్సాహక బహుమతుల కింద ఐదుగురికి రూ.2వేల చొప్పున నగదు అందించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనదల్చిన మహిళలు ఈనెల 24వ తేదీలోపు తమ పేర్లను నమోదుచేసుకోవాలని ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్లు 90309 04040, 91000 22956లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







