వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం
- September 19, 2017
రుతువులు మారినప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తేవరకూ వుండకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తి ఉసిరి ఇవ్వండి. ఉసిరిపొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది.
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసి క్రమం తప్పక తీసుకోండి. ఇవి యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి. పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్ల మిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







