ఇరాన్ లో బాలికపై అత్యాచారం, హత్య..బహిరంగంగా ఉరి

- September 20, 2017 , by Maagulf
ఇరాన్ లో బాలికపై అత్యాచారం, హత్య..బహిరంగంగా ఉరి

టెహ్రాన్ : బాలికపై అత్యాచారం చేసి..హత్య చేసిన కామాంధుడిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. సైకోలాగా ప్రవర్తిస్తూ ఏడేళ్ల బాలిక ప్రాణాలు బలితీసుకున్న 42 ఏళ్ల ఇస్మాయిల్ జాఫర్దేశ్‌ను ప్రజలందరి ముందు ఉరితీసింది. అర్దేబిల్ ప్రావిన్స్‌లోని పర్సబాద్ పట్టణంలో ప్రజలు, అధికారులు ముందు ఇస్మాయిల్‌ను బహిరంగంగా ఉరితీసిన వీడియోను ఇరాన్‌ మీడియా వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. అభద్రతా భావం, సమస్యాత్మక వాతావరణంలో ఉన్న ఇరాన్ ప్రజలకు ఇస్మాయిల్ ఉరితీత ఉపశమనం లాంటిదని అర్దేబిల్ ప్రాసిక్యూటర్ నజీర్ అతబాతి ఓ ప్రకటనలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఏడేళ్ల అతేనా అస్లానీ అనే బాలిక గత జూన్ 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అస్లానీ అదృశ్యమైన ఘటన సోషల్‌మీడియా ద్వారా ఇరాన్ అంతటా తెలిసింది. బాలిక ఆచూకీని ఎలాగైనా తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. బాలిక మిస్సింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇరాన్ ప్రెసిడెంట్ హస్సన్ రౌహానీ..బాలిక ఆచూకీని తెలుసుకుని వెంటనే అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అధికారుల బృందం గాలింపు వేగవంతం చేసిన ఇస్మాయిల్ జాఫర్దేశ్ అనే వ్యక్తికి చెందిన గ్యారేజీలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

ఇస్మాయిల్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారులు నిర్దారించారు. గతంలో ఓ మహిళ మృతి కేసులో కూడా ఇస్మాయిల్ జాఫర్దేశ్ పై కేసు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న ఇరాన్ సుప్రీంకోర్టు ఇస్మాయిల్ కు సెప్టెంబర్ 11న ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇలాంటి ఘటన మరోసారి జరుగకుండా ఉండేందుకు ఇరాన్ ఇస్మాయిల్ ని బహిరంగంగా ఉరితీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com