పద్మభూషణ్‌కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ

- September 20, 2017 , by Maagulf
పద్మభూషణ్‌కు ధోనీ పేరు సిఫార్సు చేసిన బీసీసీఐ

దేశంలో మూడో అత్యున్న పౌర పురస్కారమైన పద్మభూషణ్‌కు... భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. క్రికెట్‌కు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించాలంటూ.. బోర్డు ఏకగ్రీవంగా ఈ పేరును ప్రభుత్వానికి పంపించింది. మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ పేరు తెచ్చుకున్న ధోనీ..  2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో  వంద స్టంపింగ్స్‌ సాధించిన ఏకైక కీపర్‌గా రికార్డును కూడా సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com