బెల్లం రొట్టె
- September 20, 2017
కావలసిన పదార్థాలు : బెల్లం - 1 కప్పు, బియ్యప్పిండి - అరకప్పు (ఆరుగంటల సేపు నానబెట్టి, నీళ్లుపిండి ఆరబెట్టాలి) , నీళ్లు - 1 కప్పు, ఎండు కొబ్బరికోరు - అరకప్పు, నువ్వు లు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, నూనె - 6 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : నువ్వులు, జీడిపప్పు, కొబ్బరికోరు దోరగా వేగించి ఉంచుకోవాలి. ఒక పాత్రలో బెల్లం, నీళ్లు కలిపి బాగా మరగనిచ్చి, వేగించిన నువ్వులు, కొబ్బరి, జీడిపప్పుతో పాటు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి, మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసి మూతపెట్టి, సన్నని సెగమీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్పూనుతో గుచ్చిచూస్తే పిండి అంటుకోకుండా ఉంటే దించేసి ఒక ప్లేటులో బోర్లించి ఐదు నిమిషాలపాటు ఉంచితే రొట్టె ప్లేటులో పడిపోతుంది. దీన్ని ముక్కలుగా కోసి తినండి. పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది 3 రోజుల వరకూ నిలవ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







