ఎంత పెద్ద నడుము నొప్పికైనా సింపుల్ చిట్కా...

- September 20, 2017 , by Maagulf
ఎంత పెద్ద నడుము నొప్పికైనా సింపుల్ చిట్కా...

back pain
నడుము నొప్పి ఎన్నో విధాలుగా ఉంటుంది. నడుము కింద భాగాన నొప్పి వస్తే లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే రక్తప్రసరణ తగ్గి చిక్కగా అయినప్పుడు ఈ పెయిన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల ఈ పెయిన్ వస్తుంది. ఉద్యోగ పరంగా గాని, ఇతర ఏ కారణాల వల్ల గాని ఎక్కువసేపు కూర్చున్న వారికి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది.
 
ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ మాత్రమే కాదు. బరువు కూడా పెరిగిపోతారు. ఉదాహరణకి.. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు గమనించండి.. అక్కడ నిల్చుని పనిచేసే సర్వర్లు సన్నగా ఉంటారు. కూర్చుని ఉండే క్యాషియర్లు లావుగా ఉంటారు. నిల్చుని పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా రావట.
 
బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కూర్చునే సమయాన్ని తగ్గించాలి. పొగత్రాగి ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కొంతమంది నాశనం చేసుకుంటారో.. అలాగే ఎక్కువసేపు కూర్చుంటే అదేవిధంగా ఆరోగ్యం నాశనమై పోతుందని వైద్యనిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువ సేపు ఒకవేళ కూర్చునేవారు వాకింగ్ చేయడం కాని లేకుంటే యోగా చేయడం కానీ చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com