కొత్త ఫ్లైఓవర్ తో హైటెక్‌సిటీలో ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
- September 21, 2017
హైటెక్‌సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక్కడ మరో ైఫ్లెవోర్కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐటీ కారిడార్‌లో వెలుస్తున్న అంతర్జాతీయ ఐటీ సంస్థలతో ఇక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. దీంతో రోడ్ల సామర్థ్యానికి మించి వాహన రాకపోకలు సాగుతుంటే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిని పొందుతున్న ఐటీ కారిడార్ రోడ్లపై ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో మెట్రో పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ టవర్స్ నుంచి శిల్పారామం, ఎన్ కన్వెన్షన్ సెంటర్ వరకు సరికొత్తగా ఎలివేటెడ్ రోటరీని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. సుమారు 90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ నిర్మాణ పనుల కోసం సర్వేలను ప్రారంభించింది. పూర్తయితే సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయి. దీంతో పాటుగా పాదాచారులకు సైతం రోడ్డు దాటేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఐటీ రంగంలో దేశంతో పాటు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడ నూతనంగా చేపడుతున్న అభివృద్ధి పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే సైబర్స్ వద్ద నిర్మించనున్న ైఫ్లెఓవర్ నిర్మాణ పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతాల సర్వేతో పాటు ప్రైవేట్ ప్రాపర్టీల తొలగింపు విషయంలోనూ అన్ని చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







