యూఏఈ తొమ్మిదేళ్ళ రక్తచరిత్రకు ముగింపు
- September 21, 2017
రెండు కుటుంబాల మధ్య తొమ్మిదేళ్ళుగా నడుస్తున్న రక్తచరిత్రకు ఎట్టకేలకు ముగింపు పడింది. 2008లో అల్ అహ్‌బాబి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, అల్ బ్లౌషి కుటుంబానికి చెందిన యువకుడ్ని చంపేయడంతో ఈ వివాదం రాజుకుంది. 2012లో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, వైరి వర్గానికి చెందిన ఇద్దర్ని హతమార్చడంతో ఈ రక్త చరిత్ర ముదిరి పాకాన పడింది. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. యూఏఈకి చెందిన ప్రముఖులు ఈ వివాదానికి పరిష్కారం పలికేందుకు ముందుకొచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకూ అంగీకరించారు. ఇకపై తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని పెద్దల సమక్షంలో వారంతా ప్రతిజ్ఞ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







