కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారతీయుడు 2

- September 22, 2017 , by Maagulf
కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారతీయుడు 2

నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించే కమల్ హాసన్, హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.  వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని చర్చలు జరిపినట్లు సమాచారం.  వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించనున్నారట.  కమల్ ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలతో బిజీగా ఉన్నందున్న ఈ ప్రాజెక్ట్‌ డిస్కషన్స్‌ని  కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.  ఇదిలా ఉండగా కమల్ నటించిన 'శభాష్ నాయుడు', 'విశ్వరూపం 2' చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇక శంకర్ కూడ '2.0' చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com