భోజ్‌పురి యాక్టర్ మనోజ్ పాండే ఓ నటిని శారీరక వాంఛలకు వాడుకున్న వైనం

- September 22, 2017 , by Maagulf
భోజ్‌పురి యాక్టర్ మనోజ్ పాండే ఓ నటిని శారీరక వాంఛలకు వాడుకున్న వైనం

భోజ్‌పురి యాక్టర్ మనోజ్ పాండే భాగోతం వెలుగులోకి వచ్చింది. తనకు తాను పెద్ద స్టార్ హీరో అని చెప్పుకుంటూ  తిరుగుతున్న మనోజ్ సినీ అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. ఇలా దాదాపు 5 సంవత్సరాల నుంచి తనను మోసం చేస్తున్నాడంటూ  భోజ్‌పురి నటి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సదరు నటి మనోజ్ పై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొని రావడంతో మొఖం చాటేశాడు. దీంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించింది.  తన లాగే మరి కొందరిని మనోజ్ తన శారీరక వాంఛలకు వాడుకున్నాడంటూ మనోజ్ పై సెక్షన్ 395/17 , 376, 317, 406, 506(2) కింద కేసు ఫైల్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ ను అరెస్టు చేయడానికి అతడి ఇంటికి వెళ్లగా అతను అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com