మల్టిపుల్ స్లెరోసిస్కి సరికొత్త ట్రీట్మెంట్
- September 22, 2017
మనామా: బహ్రెయిన్‌లో మెడికల్ రీసెర్చర్స్ టీమ్ ఒకటి, మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్స కోసం సరికొత్త విధానాన్ని కనుగొంది. ప్రిన్సెస్ అల్ జవహారా సెంటర్ ఫర్ మాలెక్యులర్ మెడిసిన్, ఇన్హెరిటెడ్ డిజార్టర్స్కి చెందిన రీసెర్చర్స్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం, తాము కనుగొన్న కొత్త విధానం ద్వారా ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి చికిత్స సులభతరమవుతుందనీ, మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే, మల్టిపుల్ స్లెరోసిస్ వ్యాధిగ్రస్తుల్లో ఐదు రకాల జీన్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధనా బృందం తెలిపింది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌కి సంబంధించిన సమస్య మల్టిపుల్ స్లెరోసిస్. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ రీజియన్‌లో ఈ వ్యాధితో చాలా ఎక్కువమంది బాధపడుతున్నారు. కొత్తగా కనుగొన్న విధానంలో వ్యాధిగ్రస్తులకు చికిత్స సులభవంతమవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఈ విభాగంలో సాధించవచ్చునని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







