సముద్రంలో మునిగిన పడవ, నలుగురి మృతి

- September 22, 2017 , by Maagulf
సముద్రంలో మునిగిన పడవ, నలుగురి మృతి

టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మృతిచెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. కోస్టుగార్డు సిబ్బంది మరో 38 మందిని రక్షించారు. శరణార్థులు యూరోపియన్‌ దేశాలకు వెళ్లడానికి ఏజియన్‌ సముద్ర మార్గం కష్టంగా ఉండటంతో వారు నల్ల సముద్రం ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోస్టుగార్డులు తెలిపారు. వలసదారులను అడ్డుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌ టర్కీ దేశం గత మార్చిలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వలసలు ఆగటం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com