'తెలంగాణ సంఘం--అబుధాబి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'బతుకమ్మ సంబరాలు'
- September 23, 2017
అబుధాబి: తెలంగాణా సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో యు.ఏ.ఈ లో ఉంటున్నతెలంగానీయులందరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ బతుకమ్మ సంబరాలను అబుధాబీ నగరంలోని ఇండియా సోషల్సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. ఫిదా ఫెమ్ నటి శరణ్య ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమంలో ఆనంద ఉత్సాహాలను తారాస్థాయి కి చేర్చింది. డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు కార్యస్థలానికి చేరాక, ప్రార్ధనగీతంతో కార్యక్రమము మొదలుపెట్టారు. తర్వాత చిన్నారులు వారి ఆటపాటలతో అందరి నీఅలరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచు లందరు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని తలచుకున్నారు. వారి ఉత్సాహం ఇష్క్ ఆడిటోరియంని మరో తెలంగాణాను తలపించింది
ఈప్రక్రియలో, అన్నింటిలోనూ అందమైన బతుకమ్మలకు, బాగా సాంప్రదాయకంగా తయారైన పిల్లలకు మరియు బాగా బతుకమ్మ ఆడిన వారికి కార్యనిర్వాహకులు బహుమతులు ప్రకటించారు.
బతుకమ్మకు పూజ చేసిన అనంతరం, సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిమజ్జనంచేసి, ప్రసాదవితరణ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
ఈకార్యక్రమానికి వచ్చిన అందరికి కార్యనిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వి, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజ,గోపాల్,గోపి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
--ప్రదీప్ చవ్వా(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

















తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







