'దళపతి' పాటలు విడుదల
- September 23, 2017
రాజ్యానికి రాజెంత ముఖ్యమో, ఆ రాజును, ప్రజలను, చుట్టు ఉన్న వారికి కాపాడే దళపతి కూడా అంతే ముఖ్యం. సైన్యాన్ని ముందుండి నడిపే దళపతి రాజ్యానికి వెన్ను దన్ను. మరి మా 'దళపతి' ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు చిత్రయూనిట్. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం 'దళపతి'. సదా - కవితా అగర్వాల్, బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ " విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని, జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని దర్శకుడు సదా అన్నారు.
నిర్మాత బాబురావు మాట్లాడుతూ రజనీకాంత్, మమ్ముట్టి కాంబినేషన్‌లో పాతికేళ్ల క్రితం వచ్చిన దళపతి ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అందులో ఎలాంటి ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయో, అలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు సదా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యాజమాన్యగారు అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. అల్రెడి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మా బ్యానర్‌లో వస్తోన్న మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం" అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







