ఒమాన్ లో భవనం పైనుంచి దూకి చస్తానని బెదిరిస్తున్న భారతీయుడిని ఎట్టకేలకు రక్షించారు

- September 23, 2017 , by Maagulf
ఒమాన్ లో  భవనం పైనుంచి దూకి చస్తానని బెదిరిస్తున్న భారతీయుడిని ఎట్టకేలకు రక్షించారు

మస్కట్ : ఆ మధ్య కాలంలో తెలుగురాష్ట్రాలలో కొందరు మీడియాను పిలిచి టెలికాం టవర్లను....నీటి ఓవర్ హెడ్ ట్యాంకులను..ఎత్తయిన భవనాలు ఎక్కి అక్కడనుంచి కిందకు దూకేస్తామని బెదిరించి  తమ తమ గొంతెమ్మ కోర్కెలను తీర్చుకొనేవారు. అదే ఫార్ములాతో వారం రోజుల క్రితం ఒమాన్ వచ్చిన ఓ భారతీయదు ప్రయోగించాడు. తన స్నేహితులు మరియు పొరుగువారు తెలిపిన వివరాలాఖ్ ప్రకారం తనకు గడిచిన ఏడు రోజులలో ఏ విధమైన పని దొరకక పోవడంతో మనస్తాపంతో ఒక భవనంపైకి చేరుకొని అక్కడ నుండి కిందకు  దూకుతానని అధికారులను బెదిరించాలని నిర్ణయించుకొన్నాడని వారు తెలిపారు. ప్రమాద నివారణ జట్లు , అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని క్రేన్ సహాయంతో ఆ వ్యక్తికి సమీపంలో చేరుకొని ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తితో రక్షించే వ్యక్తులు రెండు గంటలకు పైగా నచ్చచెప్పి ఆ వ్యక్తిని క్షేమంగా కిందకు తీసుకువచ్చారు. ఈ విషయానికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో ఇటీవల విపరీతంగా ప్రాచుర్యం పొందింది. పౌర రక్షణ మరియు ఆంబులెన్స్ పబ్లిక్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం    అల్ ఖువేరులో వీధిలో ఒక పెద్ద సమూహం రెండు గంటలు పాటు గుమిగూడారు. భారతదేశానికి చెందిన కేరళా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి  అపార్ట్మెంట్లో తనను లోపల ఉంచుకొని తాళం వేసుకొని  దానిని బాల్కనీ మీద  ఒక కిటికీ నుంచి కిందకు విసిరివేసాడు. ఆ  తనను చావనిమ్మని కోరినప్పటికీ,  పౌర రక్షణ మరియు ఆంబులెన్స్ పబ్లిక్ అథారిటీ అతనితో రెండు గంటలసేపు చర్చించి కిందకు దిగి వచ్చేందుకు ఒప్పించారు చనిపోవాలని ఆలోచనకు స్వస్తి చెప్పి  రక్షక క్రేన్ యొక్క ఊయలకి దూకినప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, బుధవారం రాత్రి 10.20 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తి  కిటికీ నుంచి  బాల్కనీ పై నుండి కిందకు దూకడానికి ప్రయత్నించాడు.నేను  వెంటనే రాయల్ ఒమన్ పోలీస్ లకు  సమాచారం అందించినట్లు పొరుగు నివాసి తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com