మాటల తూటాలు పేల్చుకుంటున్న అమెరికా & ఉ.కొరియా
- September 24, 2017
వాషింగ్టన్: ఉత్తర కొరియా, అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఓ సూసైడ్ మిషన్ అని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో అన్నారు.
ఉ కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌ను డొనాల్డ్ ట్రంప్ రాకెట్ మ్యాన్‌గా అభివర్ణించారు. దానికి కౌంటర్‌గా ఉ. కొరియా విదేశాంగ మంత్రి... ట్రంప్‌ను మిషన్‌గా అభివర్ణించారు. అమెరికాలోని అమాయక జనాలకు ఏదైనా అయితే దానికి ట్రంప్ బాధ్యుడన్నారు.
తమ బలాన్ని చూపించేందుకే అమెరికా తమ దేశం దిశగా యుద్ధ విమానాలు తీసుకు వచ్చిందని ఆయన విమర్శించారు. దానికి ప్రతిగా తమ దేశపు రాకెట్లు అతి త్వరలో అమెరికాను తాకుతాయని హెచ్చరించారు.
1) పేలుడుపై అనుమానాలు
ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాలో శనివారం 3.5 తీవ్రతతో భూమి కంపించడం చర్చనీయాంశమయింది. ఇది నిజంగా భూకంపమేనా, లేకపోతే అణు పరీక్షా అనే చర్చ జరిగింది.
2) భారీ పేలుడు కావొచ్చని చైనా
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన హైడ్రోజన్ బాంబు పరీక్షా స్థలానికి 20 కి.మీ. సమీపంలోనే తాజాగా భూమి కంపించిందని చెబుతున్నారు. ఇది భారీ పేలుడు కావచ్చని చైనా సీస్మిక్ సర్వీస్ తెలిపింది. ఈ మేరకు చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రం (సీఈఎన్‌సీ) కూడా అనుమానం వ్యక్తం చేసింది.
3) ఇది భూకంపమేనని దక్షిణ కొరియా
ఇది సహజమైన భూకంపమేనని సియోల్‌లోని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ (కేఎంఏ) పేర్కొంటోంది. ఇది కృత్రిమమైన కంపం అయ్యే అవకాశాల్లేవని కొట్టిపారేసింది. భూకంప కేంద్రం సున్నా కి.మీ. లోతులోనే ఉందనీ, పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. కృత్రిమ భూకంపమే అయితే దాని ద్వారా తలెత్తే ధ్వని తరంగాలేమీ ఎక్కడా నమోదు కాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
4) ఉత్తర కొరియాకు యూట్యూబ్ షాక్
ఉత్తర కొరియాపై ఆంక్షల అమల్లో భాగంగా ఆ దేశం నుంచి అప్‌లోడ్ అయ్యే యూట్యూబ్ చానెళ్లు అన్నింటినీ యూట్యూబ్ నిలిపేసింది. దాంతో ఉత్తర కొరియా నుంచి సమాచారాన్ని అందుకొనేందుకు బయటి ప్రపంచానికి ఉన్న ఏకైక మార్గం మూసుకుపోయింది. ఇక నుంచి ఉత్తర కొరియా అధికారిక టీవీ చానెల్ మీదే ప్రపంచమంతా ఆధారపడాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







