మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ పొగిడిన సూపర్ స్టార్ మహేష్
- September 24, 2017
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని బేస్ చేసుకొని నట వారసులుగా వెండి తెరపై అడుగు పెట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు.. వారిలో చాలా మంది తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్నారు.. అలా తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్న హీరో సూపర్ స్టార్ మహేష్.. అవును నటశేఖర కృష్ణ తనయుడుగా బాలనటుడుగా నటించి అలరించిన మహేష్ బాబు.. హీరోగా అడుగు పెట్టి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని సృష్టించుకొన్నాడు.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా హవా చెలాయిస్తున్న మహేష్ బాబు.. తాజాగా స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నాడు. మురుగదాస్ దర్శకత్వం తెరకెక్కిన ఈ స్పైడర్ సినిమా ఈ నెల 27 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో పాల్గొన్న మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ కోసం చెప్పమని అడిగిన ప్రశ్నకు సంచలన జవాబు చెప్పాడు. మీ దృష్టి లో రియల్ సూపర్ స్టార్లు ఎవరు అని అడిగితే... మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు.. కానీ నాదృష్టిలో చిరంజీవి గారు- రజనీకాంత్ గారు వీళ్ళు నిజమైన సూపర్ స్టార్లు.. సినిమాతో సంబంధం లేకుండా వీరికోసం థియేటర్లు వెళ్తారు.. కానీ నటుడి కంటే స్టార్ కంటే సినిమానే గొప్పది అని చెప్పాడు.. మహేష్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ స్పైడర్ సినిమా మలయాళం లో డబ్ చేస్తున్నారు. తొలిసారిగా మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







