చాపలా ప్రభావం: పాఠశాలల మూసివేత-ఒమాన్, యెమన్ లలో హై అలర్ట్

- October 31, 2015 , by Maagulf
చాపలా ప్రభావం: పాఠశాలల మూసివేత-ఒమాన్, యెమన్ లలో హై అలర్ట్

చాపలా ప్రభావం  పాఠశాలల మూసివేత-ఒమాన్, యెమన్ లలో హై అలర్ట్ఒమాన్ ‘మల్టీ హాజర్డ్ అర్లీ వార్నింగ్ సెంటర్’ వారి విశ్లేషణ ప్రకారం, నైరుతి అరేబియా సముద్రంలో నెలకొని ఉన్న చాపలా తుఫాను, ధోఫార్ గవర్నరేట్ తీరప్రాంతం నుండి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తాజా సమాచారం. తుఫాను కేంద్రంలో వాయు వేగం 85 నుండి 95 నాట్లకు తగ్గిందని, ఇది పడమర దిశగా ప్రయాణించి, రానున్న 48 గంటల్లో యెమన్ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటవచ్చని నిపుణులు చెపుతున్నారు. కుండపోత వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున పాఠశాలలన్నిటిని మూసివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒమాన్, యెమన్ దేశాలలో అధికారులు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com