కుమారి 21ఎఫ్ చిత్ర ఆడియో విడుదలైంది
- October 31, 2015
రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్' చిత్ర ఆడియో విడుదలైంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చిత్ర బృందం సమక్షంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ ఆడియో విడుదల జరిగింది. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రజినీకాంత్, ఐశ్వర్యరాయ్‌ల సూపర్‌హిట్ కాబినేషన్లో వచ్చిన 'రోబో' చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు, కొత్త మాటల రచయిత వంటి ఎందరికో అవకాశం కల్పిండంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియో సీడీని నటుడు అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కాన్టెస్ట్ విజేతలకు నటుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా బహుమతులను అందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







