లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
- September 25, 2017
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఇంగ్లండ్‌లోని ప్రవాస తెలంగాణ వారి కోసం హౌన్‌స్లాలోని ఇండియన్ జింఖానా గ్రౌండ్స్‌లో బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 2 వేల మందికి పైగా ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యారు. మహిళలందరూ బతుకమ్మలను సుందరంగా అలంకరించి ఆడిపాడారు. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని గుర్తు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కోలాటాలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఇక తెలంగాణ నుంచి తెప్పించిన జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. వేడుకలకు వచ్చిన వారికి హైదరాబాద్ బిర్యానీ వడ్డించారు. తెలంగాణ నుంచి తమ పిల్లలు, మనుమలతో గడిపేందుకు వచ్చిన పెద్దలు, హాజరైన అతిథులు... బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని తెలిపారు. విదేశీ గడ్డపై బతుకమ్మ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం గొప్పగా ఉందన్నారు.
ఈ వేడుకలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి, ఎమ్మెల్సీ ప్రకాశ్ గౌడ్, గుండవరపు దేవీప్రసాద్, నాగేందర్ గౌడ్, దర్శకులు సురేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్‌గౌడ్, అడ్వైజరీ చైర్మన్ అంతటి ప్రమోద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శులు నగేశ్ రెడ్డి కాసర్ల, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, స్పాన్సర్ టీ అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేశ్ ఎనపోతుల, మీడియా టీం సాయి ప్రసాద్ మార్గం, శిరీష్ కే చౌదరి, స్వచ్ఛంద మరియు సంక్షేమ టీం మీనాక్షి అంతటి, తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు హేమలత గంగసాని, జయశ్రీ గంప, జ్యోతిరెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతి సీక, ప్రియాంక కర్పూరం, రమాదేవి తిరునగరి, శ్రీలక్ష్మి మర్యాల, సుచరిత కాల్వ, వాణి రంగు, నందిని మొట్ట, భారతి కొప్పుల, రజిత, వాణి రంగు, ఏరియా ఇంచార్జులు.. వెస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ శ్రీధర్ నల్ల, వీరు చౌదరి, రమేశ్ సింగం గౌడ్, శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ శ్రీధర్ బాబు మంగళారపు, సంతోష్ కోడిప్యాక పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







