మెమరీ కార్డ్ కోసం సోదరుడ్ని చంపిన వ్యక్తి
- September 25, 2017
24 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి తన సోదరుడ్ని సిజర్తో పొడిచి చంపేసిన ఘటనకు సంబంధించి అజ్మన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టుకి ఈ కేసును రిఫర్ చేసింది. కెమెరాకి సంబంధించిన మెమరీ కార్డ్ విషయమై అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేవలం 100 దిర్హామ్ల విలువైన మెమరీ కార్డ్ కోసం ఈ హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. గొడవ జరుగుతున్న సమయంలో సోదరుల్ని వారించేందుకు సోదరి తీవ్రంగా ప్రయత్నించినా, గొడవ ముదిరి పాకాన పడ్డం, సోదరులిద్దరూ ఆవేశకావేశాలకు పాల్పడటంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. నిందితుడు, సోదరుడితోనూ, సోదరితోనే కాక, తల్లితోనూ మెమరీ కార్డ్ కోసం గొడవపడ్డాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







