చేపల ధరల పెంపుపై 'సోషల్' పోరాటం
- September 25, 2017
మనామా: బహ్రెయినీలకు అత్యంత ప్రీతి పాత్రమైన చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు, పోరుబాట కూడా పట్టారు. కొన్నాళ్ళపాటు చేపలు, రొయ్యలను తినడం బహిష్కరించాలనీ, తద్వారా మార్కెట్‌లో డిమాండ్ తగ్గి, అమ్మకందారులు రేట్లను తగ్గిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'లెట్ ఇట్ రాట్' అనే స్లోగన్‌తో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. తాజా చేపల ధర కిలో 6 బహ్రెయిన్ దినార్స్ నుంచి 7 బహ్రెయిన్ దినార్స్ వరకు పలుకుతోంది. ఇది సామాన్యులు భరించలేని ధర అనే విమర్శలు వినవస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







