అక్టోబర్‌ 6న గల్ఫ్‌లో 'మార్చ్‌ 22' విడుదల

- September 25, 2017 , by Maagulf
అక్టోబర్‌ 6న గల్ఫ్‌లో 'మార్చ్‌ 22' విడుదల

దుబాయ్‌: కన్నడలో ఘనవిజయం సాధించిన 'మార్చ్‌ 22' సినిమా గల్ఫ్‌లో అక్టోబర్‌ 6న విడుదల కాబోతోంది. దుబాయ్‌, అబుదాబీ, సార్జాలలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అనంత్‌ నాగ్‌, రాధికా చేతన్‌ ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా దుబాయ్‌లో, షార్జా, అబుదాబీల్లో సందడి చేయనున్నారు. సీనియర్‌ నటుడు అనంత్‌ నాగ్‌ 'మార్చ్‌ 22' సినిమాలో చూపిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన భార్య సీనియర్‌ నటి గాయత్రి అనంత్‌ నాగ్‌, రాధికా చేతన్‌, తదితరులు ఈ సినిమా తొలి ప్రదర్శనకు హాజరవుతారు. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీష్‌ షెరిగార్‌, ఆయన సతీమణి షర్మిలా షెరిగార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్‌ దర్శకుడు కొడ్లు రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనికంఠ కద్రి - ఎన్‌జె రవిశంకర్‌ రాజంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com