అమ్మ మనసు

- November 01, 2015 , by Maagulf

 


కాళ్ళు, కళ్ళు, ఒళ్ళు ఏవి సహకరించకున్నా,
ఓ పెళ్ళైనా,ఓ పూజైనా లేదా ఓ గుడి జాతరయినా  
ఓ భజనో భాగోతమో ఏదైతేనేం,

నన్ను తీసుకెల్లలేదని ఏడ్చి గీ పెడ్తుంది నులక మంచంలో,
లెవ్వ సాత గాకున్నా ,పసిపాపలా అలిగి అన్నం మానేస్తుంది ..

ఒక్క రోజు నువ్వు మాట్లాడక పోతే,నన్ను గానట్లేదని(కనికరించట్లేదని) 
లోలోనే కుమిలి పోతుంది.. చిన్న పిల్లల ముడుచుకు పోతుంది 

ఆవిడెవరో కాదు 

తాను తిండి తినకున్నా,నా పొట్ట లోని 
ఆహారాన్ని నా కళ్ళ లోని ఆకలిని 
లెక్క లేస్తుంది.. 

కట్టుకున్న వాడు తనని,కని వదిలెల్లిన వారసుల్ని 
చూసుకుంటూ, కాలం జేసే తన ఊరందరికీ 
పిలువని చుట్టమై కన్నీరు వదిలోస్తుంది ..  

నన్ను రుపాయిడిగితే కోపంతో,వీపు విమానం మోత 
మ్రోగించి బడికి పంపి, తిరిగొచ్చినాక గుండెలకు హత్తుకొని 
మాతృ ప్రేమతో వెక్కి వెక్కి  ఏడ్చిన అమ్మ .. 

ఇప్పుడూ, దావఖానకు పోత బిడ్డ, ఇంజక్షన్ చేపించుకుంట బిడ్డ 
కడుపు బాగా నొస్తుంది,ఒక వంద రూపాలియ్యు కొడుకా అని దీనంగా 

నా చుట్టూ నీ చుట్టూ లేచి నిలిచున్న ఆ అమ్మ చేతులు 
కాస్త జాగ్రత్తగా గమనించూ... అప్పుడు అమ్మా ఇప్పుడు నీ బిడ్డా .... 
కావొచ్చు .. 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com