ఆస్ట్రేలియాలో ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- September 26, 2017
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్ కార్పొరేషన్ (ఏటీఏఐ) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు బంగారు నాణేలను అందించారు.
ఈ సందర్బంగా ఏఐటీఐ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి దేశం మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు గత నాలుగేళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు. ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో విస్తరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







