అపోలో కాన్సర్ ఇన్స్టిట్యూట్ చిన్నారులతో గడిపిన నిక్కీ గల్రానీ
- September 26, 2017
సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో హీరోయిన్గా నటించిన నిక్కీ గల్రానీ గుర్తుందా..! నిక్కీ అపోలో హాస్పటల్ కు ముఖ్య అతిధిగా హాజరై అక్కడ క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో గడిపింది.. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులతో ఆడి, పాడి ఉత్సాహం నింపింది. వారితో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... "అంతా చిన్న వయసులో క్యాన్సర్ తో పోరాడటాన్ని చూస్తుంటే వారే నిజమైన విజేతలు అనిపిస్తుంది అని కామెంట్ కూడా జత చేసింది ఆ ఫోటోకి..
తోటి చిన్నారులతో కలిసి..బొమ్మలతో ఆడుకోవలసిన వయసులో జీవితం కోసం పోరాటం.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చే మనోధైర్యం ను అభినందిస్తున్నా... క్యాన్సర్ తో పోరాడుతూ.. మరో జీవితాన్ని గిఫ్ట్ గా పొందుతున్న వారిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.. ఈ చిన్నారులతో గడిపే అవకాశం ఇచ్చిన అపోలో హాస్పటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులే కాదు.. ప్రతి ఒక్కరూ త్వరగా క్యాన్సర్ నుంచి కోలుకోవాలని కోరుకొంటున్నా అని నిక్కి తెలిపింది..తమ నటనతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో, హీరోయిన్లు.. సామాజిక సృహను కూడా కలిగి ఉంటున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే తమకు తోచిన సాయం చెయ్యడానికి ఇటీవల హీరోయిన్స్ ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







