మహిళలపై ఆంక్షలను ఎత్తేస్తూ, సౌదీ కొత్త నిర్ణయం మహిళలు డ్రైవ్ చేసుకోవచ్చు
- September 26, 2017
మహిళలపై ఆంక్షలను ఒక్కోక్కటిగా ఎత్తేస్తూ వస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో నిర్ణయి తీసుకుంది. డ్రైవింగ్ చేసేందుకు మహిళలకు అనుమతిస్తూ మంగళవారం రాచరిక ఉత్తర్వులను జారీచేసింది .
సౌదీలో మహిళలపై అన్ని రంగాల్లో కఠిన అంక్షలు కొనసాగేవి. వీటిని ఎత్తివేయాలంటూ 1990 నుంచి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు డ్రైవింగ్ చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘేనన్న వాదనతో సౌదీ రాజు ఏకీభవించారు. చివరకు ఆ నిబంధనను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో మహిళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలం దక్కిందని ఫవ్జియా అల్ బక్ర్ అనే ఉద్యమ నేత చెప్పారు.
మరోవైపు సౌదీ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘సరైన మార్గంలో గొప్ప ముందడుగు’ వేసిందంటూ సౌదీ అరేబియాను ప్రశంసించింది .ప్రస్తుతం మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, అక్కడి మహిళలను స్టేడియంలోకి అనుమతించకపోవటం అన్నది ఇంతకాలంగా ఉండేది. అయితే ఈ నెల 24న దేశ 87వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి మహిళలను స్టేడియంలోకి అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







