జగన్ సతీమణి కి ఊహించని షాక్
- September 27, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వై ఎస్ జగన్ కి ఒక దాని పై మరొకటి దెబ్బలు తగులుతున్నాయి …అయితే ఈ సారి ఈ దెబ్బ ఊహించని రూపం లో అదీ ఆయన సతీమణి భారతిరెడ్డి కి తగలింది .
వివరాల్లోకి వెళితే అప్పట్లో విజయవాడ కేంద్రంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే …అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవటం ఈ కాల్ మనీ అనే వ్యవస్థని ఉక్కుపాదం తో తోక్కేయటం జరిగినవి అయితే అప్పట్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న క్రమం లో సాక్షి దినపత్రిక సరయిన సాక్ష్యాలు లేకుండా పలువురి పై అభాండాలు మోపింది అని తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా దుయ్యబట్టారు అయితే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగానికి అద్యక్షత వహిస్తున్న చలసాని ఆంజనేయులు ఒక అడుగు ముందుకు వేసి సాక్షి పత్రిక పై పరువునష్టం దావా వేసారు ….తనకు ఎటువంటి సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లో తన ప్రమేయం ఉన్నట్లు కధనాలు రాసి తన పరువుకి భంగం కలిగించారు అనేది ప్రధాన అభియోగం …అయితే ఈ కేసులో నూజివీడు కోర్టు సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి విచారణకి హాజరు అవ్వాలి అని ఉత్తర్వులు జారీ చేసినా విచారణ కి హాజరు కాకపోవటం తో కోర్టు ధిక్కారణ కింద వీరిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది మరి ఈ గండం నుంచి జగన్ సతీమణి ఎలా బయటపడతారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







