రజనీ అల్లుడు ధనుష్ తో రాజమౌళి
- September 27, 2017
బాహుబలితో తన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు దర్శకుడు రాజమౌళి. దాంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో వుండబోతోందన్న క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో రాజమౌళి నెక్స్ట్ మూవీ చేయనున్నాడని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దానయ్య నిర్మించబోయే ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి తెరకెక్కనుందని టాక్.
దానయ్య బ్యానర్‌లో మూవీ వుందంటూ రాజమౌళి నుండి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఐతే ధనుష్‌తో జక్కన్న సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఓ విధంగా ఇది రేర్ కాంబో అనే చెప్పాలి. ఎందుకంటే ధనుష్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తమిళంలో మంచి మార్కెట్ వుంది.. ఇక బాలీవుడ్‌లో 'షమితాబ్'తో నటుడిగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, తమిళం, హిందీలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే అఫిషియల్‌గా క్లారిటీ వస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







