ఆన్‌లైన్‌ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఖాతాదారులకు శుభవార్త...

- September 27, 2017 , by Maagulf
ఆన్‌లైన్‌ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఖాతాదారులకు శుభవార్త...

ఆన్‌లైన్‌ సామాజిక మాధ్యమం ట్విటర్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకూ ఎవరైనా ట్విటర్‌ వేదికగా తమ భావాలను పంచుకోవాలంటే ఆ భావాన్ని కేవలం 140 అక్షరాల్లోనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ట్విటర్‌ ప్రియులకు ఆనందం 'డబుల్‌' కానుంది. ట్వీట్‌ అక్షరాల పరిమితి 280కు పెంచుతూ చేపట్టిన టెస్ట్‌ ప్రాజెక్టు విజయవంతగా పనిచేస్తోందని ట్విటర్‌ తెలిపింది. ఇది ట్విటర్‌కు మరింత వూతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ట్విటర్‌ 2006లో ప్రారంభమైంది. ఆంగ్ల భాషను దృష్టిలో పెట్టుకుని ఒక ట్వీట్‌కు కేవలం 140 అక్షరాల పరిమితిని విధించింది. అయితే ఇతర భాషల వారు ట్వీట్‌ చేసే సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆసియా, చైనా దేశాలకు ఈ సమస్య పెద్దదిగా ఉంది. దీంతో ట్వీట్‌ అక్షరాల పరిమితిని పెంచేందుకు ట్విటర్‌ కార్యాచరణ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా పరీక్షించింది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com