యూ. ఏ. ఈ. లో మసీదులకు దేశ అమరవీరుల పేర్లు

- November 01, 2015 , by Maagulf
యూ. ఏ. ఈ. లో మసీదులకు దేశ అమరవీరుల పేర్లు

యూ. ఏ. ఈ. లో మసీదులకు దేశ అమరవీరుల పేర్లు దేశం కోసం సమాజ, మిలటరీ మరియు మానవతా రంగాలలో  విధులు నిర్వహిస్తూ; స్వదేశంలోనూ, ప్రవాసంలోనూ కూడా అమరులయిన వీరుల పేర్లను పెట్టడానికి, జనరల్ అధారిటీ ఆఫ్ ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ (GAIAE) వారితో కలసి కృషి చేస్తామని అబుధాబీ యువరాజ ఆస్థానం యొక్క అమరవీరుల కుటుంబ వ్యవహారాల కార్యాలయం ప్రకటించింది. GAIAE ఛైర్మన్ డా. మొహ్యామెద్ మత్తార్ అల్ కాబీ, ఈ చర్య ఆ వీరుల బలిదానాలకు గుర్తింపుగా, ఇస్లాంలో అమరత్వానికి, త్యాగానికి గల ప్రాముఖ్యతను తెలియజేసేదిగా చేపడుతున్నామని, అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రముఖ సంస్థలు మరియు వ్యక్తుల సహాయంతో  ఆ అమరవీరులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడo కూడా తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com