సంతోష్ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
- September 28, 2017
యేడాదికో సినిమా.. ఇప్పుడీ మాటకు స్పేస్ లేదు. కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు.. ఇంకా వీలైతే మూడో సినిమానూ అదే యేడాది కమిట్ అవుతున్నారు. ఈ యేడాది కాటమరాయుడుగా ఖలేజా చూపించాడు పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయకపోయినా కాటమరాయుడు డీసెంట్ విజయం సాధించింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ. ఓ సినిమా చేస్తూనే మరో సినిమా కమిట్ కావడమే కాదు.. షూటింగ్ లోనూ పార్టిసిపేట్ చేసి ప్రొడక్షన్ వర్క్‌ను రాపిడ్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లుతున్నాడు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగబోతున్నాడు. అందుకే వీలైనంత వేగంగా కొన్ని సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలో ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ మూవీని త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇది పవన్ కు 25వ సినిమా. భారీ తారాగణంతో మళ్లీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తుందీ చిత్రం. కీర్తి సురేష్, అనూ ఇమ్మానయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తోంది. సో.. ఇప్పుడీ మూవీ సెట్స్ పై ఉండగానే.. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా ఓకే చేశాడు. అలాగే బాలీవుడ్ హిట్ మూవీ జాలీ ఎల్ఎల్ బీ -2కు రీమేక్ చేసేందుకూ ఓకే చెప్పాడు. ఆ మూవీకి మాటలు త్రివిక్రమ్ అందిస్తాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







