త్వరలో రాబోతున్న ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్

- September 28, 2017 , by Maagulf
త్వరలో రాబోతున్న ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్

ఇండియాలో బ్లడ్ డొనేషన్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల బ్లడ్ బ్యాంక్స్‌తోపాటు రక్తం అవసరమైన వ్యక్తులు డోనార్లను సునాయాసంగా కలుసుకునే వీలుంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అంతేకాదు యూజర్ల న్యూస్ ఫీడ్‌లో రక్త దాతలుగా చేరండి అన్న సందేశాన్ని కూడా ఇవ్వనుంది. ఇందులో భాగంగా యూజర్ బ్లడ్ గ్రూప్, ఇంతకుముందు రక్త దానం చేశారా అన్న వివరాలు అడుగుతారు. ఒకవేళ ఎవరికైనా రక్తం అవసరమైతే దానికి సంబంధించిన వివరాలను కూడా డోనార్లకు ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు అందజేస్తుంది. బ్లడ్ గ్రూప్, హాస్పిటల్ పేరు, రక్తం అవసరమైన వారి ఫోన్ నంబర్‌లాంటి వివరాలు ఇస్తారు. ఇండియాలో రక్తం కొరత చాలా ఉంది. చాలా మంది రక్తం అవసరమైనపుడు డోనార్ల కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఫీచర్ యాడ్ చేస్తున్నట్లు ఫేస్‌బుక్ సౌత్ ఏషియా ప్రోగ్రామ్స్ హెడ్ రితేష్ మెహతా అన్నారు. ఇటు దాతలను, అటు రక్తం అవసరమైన వాళ్లను ఒక్క దగ్గరికి తీసుకురావడమే ఈ ఫీచర్ ఉద్దేశమని స్పష్టంచేశారు.
ఇక దాతల వివరాలను కూడా గోప్యంగా ఉంచనున్నారు. డీఫాల్ట్‌గా ఇది ఓన్లీ మీ కింద వివరాలు సేవ్ అవుతాయి. యూజర్లే తమ టైమ్‌లైన్‌లో డోనార్ స్టేటస్‌ను షేర్ చేసుకుంటే వివరాలు పబ్లిక్ అవుతాయని ఫేస్‌బుక్ ప్రోడక్ట్ మేనేజర్ హేమ బూదరాజు తెలిపారు. ఈ ఫీచర్‌ను తొలిసారి ఇండియాలోనే లాంచ్ చేయబోతున్నారు.
ఆండ్రాయిడ్, మొబైల్ వెబ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఉన్న బ్లడ్‌బ్యాంక్స్ ఫేస్‌బుక్‌లోని డోనార్లతో కనెక్ట్ కావచ్చని హేమ చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో దేశంలోని అన్ని నగరాలకు ఈ అవకాశం ఉంటుంది. డోనార్ స్టేటస్ క్రియేట్ చేసుకున్న తర్వాత దగ్గర్లో ఉన్న డోనార్లకు ఫేస్‌బుక్ నోటిఫికేషన్లు ఇస్తుంది.
దాతలు రక్తం అవసరమైనవారికి కాంటాక్ట్ చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com