ఎదిగిన కొద్దీ ఒదిగే ఉన్న కమెడియన్ వెన్నెల కిషోర్

- September 28, 2017 , by Maagulf
ఎదిగిన కొద్దీ ఒదిగే ఉన్న కమెడియన్  వెన్నెల కిషోర్

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఒక్క సినిమా హిట్టయితే చాలు రాత్రికి రాత్రే వారి స్టేటస్ మారిపోతుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గరు. అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న వెన్నెల కిషోర్ కమెడియన్‌గా స్టార్ స్టేటస్ పొందాడు.  దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఫుల్ క్రేజ్‌లో ఉన్నాడు. అయినా కూడా తన రెమ్యునరేషన్ పెంచలేదు.  చాలా కాలం నుంచి రూ. 1లక్ష రెమ్యునరేషన్‌తోనే కొనసాగుతున్నారు.  కమెడియన్స్‌లో రెమ్యునరేషన్ పరంగా బ్రహ్మానందం రోజుకి 5 లక్షలు డ్రా చేస్తూ టాప్ రేంజ్‌లో ఉన్నాడు.  
వెన్నెల కిషోర్ వరుస సినిమాలతో చాలా బిజిగా ఉన్నాడు.  ఇటీవల తను నటించిన అమీ తుమీ హిట్ అయ్యింది.  గతంలో నటించిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాధించాయి.  ప్రస్తుతం శ్రీవాస్ డైరక్ట్ చేస్తున్న ఓ చిత్రంలో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం పొలాచి వెళ్లాడు.  అక్కడ షూటింగ్ ముగించుకుని పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అటునుంచి నాగశౌర్య మూవీ కోసం గుంటూరు వెళ్లారు.  అక్కడి నుంచి సాహో సినిమా కోసం మళ్లీ హైదరాబాద్ వచ్చారు. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ రెమ్యునరేషన్ పెంచక పోవడంతో వెన్నెల కిషోర్ పట్ల ప్రశంశలు కురిపిస్తుంది టాలీవుడ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com