చిన్న పిల్లలను దేవతలుగా మారుస్తున్న నేపాలీయులు
- September 28, 2017
కొన్ని దేశాలు, ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టెక్నాలజీ యుగంలో కూడా కాలం చెల్లిన ఆచార వ్యవహారాలకి పట్టం కడుతున్నారు. పెద్దల మూఢనమ్మకాలకు పిల్లలను బలి చేస్తుంటారు. నేపాల్‌లోని హిందూ మత గురువులు మూడేళ్ల బాలికను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్న చిన్నారులను కుమారీలుగా నియమించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఈ చిన్నారిని నేపాలీయులు తమ ఆరాధ్య దైవమైన తలెజుగా భావిస్తారు. ఒకసారి దేవతగా ఎంపికైన బాలిక యుక్తవయస్సు వచ్చే వరకు మాత్రమే దేవత హోదాలో ఉంటుంది.
దేవత ఎంపిక కూడా మామూలుగా ఉండదు. మూడు వారాల పాటు కఠిన పరీక్షలు పెడతారు. అందులో నెగ్గిన వారిని మాత్రమే దేవతగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ పరీక్షల్లో ముఖ్యమైనవి శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు, నేత్రాలు, దంతాలలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. బలి ఇచ్చిన పశువుల మధ్య ఓ రాత్రి అంతా ధైర్యంగా ఉండాలి. మూడు రాజవంశాలైన కాఠ్మండు, పటాన్, భక్తపూర్ల నుంచి మాత్రమే ఈ దేవతల ఎంపిక జరుగుతుంది. దేవతగా ఉన్నంతకాలం ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. త్రిష్టా శాక్య అనే చిన్నారి ఈ సారి దేవతగా ఎంపికైంది. అయితే ఈ సంప్రదాయాన్ని నిరసిస్తూ బాలల హక్కుల సంఘాలనుంచి విమర్శలు రావడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో దేవతలుగా ఎంపికైన బాలికలకు విద్యను అందిస్తున్నారు. నేపాలీ ప్రభుత్వ నేతలు కూడా ఈ చిన్నారి దేవతల ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఈ సంప్రదాయాన్ని వారు ఎంత బలంగా విశ్వసిస్తున్నారో అర్థమవుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







