అంగరంగ వైభవంగా 'CMYF' వారి బతుకమ్మ మరియు దసరా సంబరాలు

- September 29, 2017 , by Maagulf

మస్కట్: గురువారము రాత్రి మస్కట్ నగర నడిబొడ్డున అల్ఫాలజ్ హోటల్ నందు అంగరంగ వైభవముగా 2000 మంది తెలుగు ప్రజలు మధ్య చిరు మెగా యూత్ ఫోర్స్, మస్కట్ వారు అద్భుతముగా బతుకమ్మ మరియు దసరా సంబరాలు నిర్వహించారు. భారత రాయబార కార్యాలయము నుంచి అంబాసడార్ శ్రీ ఇంద్రమని పాండే ముఖ్య అతిధిగా వచ్చి కార్యక్రమముకు కొత్త అలంకారము తెచ్చారు. CMYF వారు ఈ కార్యక్రముములో మస్కట్ ,ఒమాన్ దేశములో వున్న సీనియర్ తెలుగు దంపతులును అంబాసడార్ తో సన్మానము చేసి మంచి సంప్రదాయముకు తెర తీసారు ..మరి ముక్యముగా హైదరాబాద్ నుంచి వచ్చిన v6 ఛానల్ తీన్మార్ కమెడియన్ బిత్తరసత్తి మరియు వర్ధమాన గాయని మధుప్రియ ఆహుతులను అలరించారు. కార్యక్రమం అనంతరము CMYF మస్కట్ వారు మంచి విందు భోజనము ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com