అనుష్క కి ఏమైంది?

- September 30, 2017 , by Maagulf
అనుష్క కి ఏమైంది?

అనుష్క కెరీర్‌ ప్రస్తుతం డోలాయమాన స్థితిలో ఉంది. వస్తున్న అవకాశాల్ని పక్కన పెట్టేస్తోందో, లేదంటే అవకాశాలే రావడం లేదో తెలీదు గానీ, అనుష్క చేతిలో పెద్దగా సినిమాలేం లేవు. ఆమె చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా... 'భాగమతి' ఒక్కటే. అది కూడా సెట్స్‌పై ఉంది. చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కథానాయికగా అనుష్కని ఎంచుకొన్నారని ప్రచారం జరుగుతున్నా, ఈ విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే కథానాయికగా నయనతారని ఎంచుకొన్నారు. ప్రగ్యా జైస్వాల్‌కీ స్థానం దక్కిందని తెలుస్తోంది. బాలీవుడ్‌ నుంచి ఐశ్వర్యరాయ్‌ని దిగుమతి చేసుకోబోతున్నారని సమాచారం. వీళ్లందరూ ఉండగా అనుష్కకి స్థానం దొరుకుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. ఈ చిత్రంలో మరో కథానాయికకీ చోటుందని, ఆ స్థానం అనుష్కదే అని ఫిల్మ్‌నగర్‌లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

'సైరా నరసింహారెడ్డి' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే ఉంది. దీపావళి తరవాతే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈలోగా అనుష్క ఎంపికపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com