దుబాయ్ లో ఘనంగా 'దసరా' సంబరాలు

- September 30, 2017 , by Maagulf

దుబాయ్: భారత సంస్కృతిలో పండుగలు ఒక ప్రత్యేక పాత్ర ను పోషిస్తాయి. పండుగ వస్తోందంటే ఊరూరా సందడి నెలకొంటుంది. నవరాత్రుల శోభా, ఆడవారి దాండియా తో దసరా ఎంతో కన్నులపండువగా జరుగుతుంది. భారత దేశంలో ఇంత ఘనంగా జరగటం పెద్ద విషయమేమీ కాదు కానీ ఇంతే సందడితో, కోలాహలంతో ముస్లిం దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల్లో జరిగితే విశేషమే మరి. దుబాయ్ లో లహెజ్ & సుల్తాన్(జెబెల్ అలీ)లో గల వర్కర్స్ క్యాంపు లో గత పన్నెండు సంవత్సరాలుగా పదివేల మంది కలిసి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక్క దసరా నే కాకుండా వినాయక చవితి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడి భారతీయులు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో హిందూ సోదరులకు అండగా ముస్లిం సోదరులు కూడా తమ వంతు సాయం అందిస్తూ ఉండటం గమనార్హం. అన్నదానం కార్యక్రమం లో 10,000 మంది కి పైగా పాల్గొంటారు. 

ఈ కార్యక్రమాన్ని బెత్ రెడ్డి వెంకట్ రెడ్డి,సూర్య నారాయణ్ రెడ్డి మాడపాటి, కొండా బాబు బొర్రా,రామ కృష్ణ,
బాపి రాజు,వీరెడ్డి వెలగల ,కర్రీ హరినాధ్ రెడ్డి మాడపాటి నరేంద్ర రెడ్డి,గణపతి రెడ్డి ,సతీష్ రెడ్డి,సుధాకర్ రెడ్డి  తదితరుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com