'47 డేస్' ప్రీ లుక్ విడుదల
- September 30, 2017
ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ 47 డేస్ సినిమా తెరకెక్కుతుంది. సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతుంది. హై గ్రిప్పింగ్ నేరేషన్‌తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని తప్పకుండా థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మిస్తున్నారు. గోవా, వైజాగ్, అరకు, లక్నవరం అండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో బిగ్ బాస్ పార్టిసిపెంట్ హరితేజ, రవివర్మ,శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు. కాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







