'47 డేస్' ప్రీ లుక్ విడుదల

- September 30, 2017 , by Maagulf
'47 డేస్' ప్రీ లుక్ విడుదల

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్  47 డేస్ సినిమా తెరకెక్కుతుంది. సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని  ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతుంది. హై గ్రిప్పింగ్ నేరేషన్‌తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని తప్పకుండా థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్  తెలిపింది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈ మూవీ  పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మిస్తున్నారు. గోవా,  వైజాగ్, అరకు, లక్నవరం అండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో బిగ్ బాస్ పార్టిసిపెంట్ హరితేజ, రవివర్మ,శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు. కాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com